ETV Bharat / city

Kondagattu Anjanna: ప్రారంభమైన కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు

Kondagattu Anjanna Utsavalu: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. హనుమాన్ దీక్షాపరులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని మాల విరమణ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతాచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Kondagattu Anjanna Utsavalu
కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు
author img

By

Published : Apr 14, 2022, 4:13 PM IST

Kondagattu Anjanna Utsavalu: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చిన్న జయంతి పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాలు... మూడు రోజులపాటు(ఈనెల 16 వ తేదీ వరకు) కొనసాగుతాయి. ఉత్సవాలు ‌ప్రారంభం కావటంతో ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి.. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో భారీ స్థాయిలో హనుమాన్‌ దీక్షాపరులు కొండపైకి చేరుకొని మాలవిరమణ చేయనున్నారు.

కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు

సుమారు 3 లక్షల మంది భక్తులు ఆలయానికి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బారికేడ్లు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు.

ఇవీ చదవండి: ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి

ఒంటిమిట్టలో కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి... పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.