విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్ పై దాడి చేసిన కేసులో.. నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. శ్రీనివాసరావు తల్లి దండ్రులకు ఆరోగ్యం సరిలేదని బెయిల్ మంజూరు చేయాలని.. పిటిషనర్ తరపు న్యాయవాది గతంలో వాదనలు వినిపించారు.
ప్రస్తుతం.. బెయిల్ మంజూరు చేయడం సరికాదని ఎన్ఐఏ తరపు న్యాయవాది.. కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువురు వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ముంపు ఉండదు ఏపీ స్పష్టం