ETV Bharat / city

వందల కిలోమీటర్లు నడిచి..అభిమాన నటుడికి ఆ సీడీని ఇచ్చి

అభిమాన నటుడిని కలవాలనే ఆకాంక్ష, పట్టుదల.. అతనికి వందల కిలోమీటర్ల దూరాన్ని దగ్గర చేశాయి. కొవిడ్​ సమయంలో వేలాదిమందికి సహాయం చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు సోనూసూద్​ను కలుసుకునేందుకు కాలినడకన బయలుదేరారు. సోనూసూద్​పై పాటలు రచించి ఆ పాటల సీడీని ఆయనకు బహుకరించారు సూర్యాపేట జిల్లాకు చెందిన దేవపంగు ఇంద్రకుమార్​..

సోనూసూద్
సోనూసూద్
author img

By

Published : Sep 9, 2021, 8:12 PM IST

సోనూసూద్ తో దేవపంగు ఇంద్ర కుమార్

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్ర కుమార్.. నటుడు సోనూసూద్​కు వీరాభిమాని. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సోనూ చేసిన సాయంపై కృతజ్ఞతతో ఏదైనా చేయాలనుకున్నారు. ఆయనను కలిసి తన అభిమానాన్ని తెలియజేయాలనుకున్నారు. అందుకే సోనూ చేసిన సామాజిక సేవపై స్వయంగా పాటలు రచించి పాడారు. ఆ పాటల సీడీని తీసుకుని హైదరాబాద్ నుంచి ముంబయికి కాలినడకన వెళ్లి రియల్​ హీరోను కలిశారు.

అభిమాని గురించి తెలుసుకున్న సోనూసూద్.. ఇంద్రకుమార్​తో మాట్లాడి పాటల సీడీని ఆవిష్కరించారు. సోనూపై రాసిన పాటను ఆ యువకుడితో పాడించారు. సోనూసూద్​ని కలిసి ఇంద్రకుమార్​ అభినందనలు పొందడం పట్ల.. కోమరబండ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

సోనూసూద్​ నిరుపేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలతో ఆయనపై అభిమానం పెంచుకున్నాను. అందుకే ఆయనపై కొన్ని పాటలు రాసి.. ఆ సీడీతో కాలినడకన హైదరాబాద్​ నుంచి ముంబయికి చేరుకున్నాను. సోనూసూద్​ నేను రాసిన పాటలపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో నా కోసం హైదరాబాద్​ వస్తా అన్నారు. -ఇంద్రకుమార్​, కోదాడ వాసి

ఇదీ చదవండి: SONUSOOD: విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.