ETV Bharat / city

'జగన్​ డైరెక్షన్​లో అనిశా ఒత్తిడితోనే అచ్చెన్నాయుడు డిశ్చార్జ్' - అచ్చెన్నాయుడు అరెస్టు వార్తలు

గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని ఏసీపీ అధికారుల ఒత్తిడితోనే డిశ్చార్జ్ చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ డైరెక్షన్​లోనే ఈ వ్యవహరమంతా జరుగుతోందని అన్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు ఇవ్వకుండానే జైలుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kinjarapu rammohan naidu slams ycp govt
kinjarapu rammohan naidu slams ycp govt
author img

By

Published : Jul 1, 2020, 8:00 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై ఎంపీ, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ... శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడిని వీల్​ చైర్​ మీద తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేకుండా కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అరాచాకలపై పోరాడుతున్నందునే ఇలా దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ డైరెక్షన్​లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

మీడియాతో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు

'సీఎం జగన్ డైరెక్షన్​లోనే అచ్చెన్నాయుడు వ్యవహరం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్ర పన్నారు. ఈఎస్​ఐ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు డాక్టర్లపై అనిశా వాళ్లు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నామమాత్రంగా చికిత్స అందించారని అర్థమవుతోంది. అచ్చెన్నాయుడు నిలబడలేని స్థితిలో ఉన్నా... జైలుకు తరలించారు. మంగళవారం చేసిన టెస్టుల ఫలితాలు ఇంకా రానేలేదు. అయినా హాస్పిటల్​ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారు..? ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు ఎవరికిచ్చారు..?'- కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

ఇదీ చదవండి:

అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.