ETV Bharat / city

'అయ్యా..ఎస్‌' అంటే అంతే.. ప్రభుత్వ తప్పులకు తలదించుకోవాల్సిందే..! - 8మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు హైకోర్టు

IAS officers: వారు ఐఏఎస్‌లు.. బ్యూరోక్రసీలో తిరుగులేని అధికారులు.. చట్టాలు చేయడానికి ఇచ్చే సలహాల నుంచి వాటి అమలు వరకూ వారికి విస్తృతాధికారాలు ఉన్నాయి. వారు కాదంటే ఒక్కోసారి మంత్రులూ ఏమీ చేయలేరు. అంతటి కీలకమైన అధికారులు ప్రభుత్వం చేసే తప్పుల కారణంగా తలవంచుకోవాల్సి వస్తోంది. న్యాయస్థానాల ముందు దోషులుగా నిలవాల్సి వస్తోంది. కోర్టుధిక్కరణ కింద 8మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు ఇటీవల హైకోర్టు రెండు వారాల జైలుశిక్ష విధించడం, వారి క్షమాపణలతో దాన్ని సేవా శిక్షగా మార్చడం ఆ కోవలోనిదే. ఇదివరకు ఏవో అసాధారణ కేసుల్లోనే కోర్టు మెట్లు ఎక్కే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఇప్పుడు తరచూ కోర్టుల్లో తలొంచుకుని నిల్చోవాల్సి వస్తోంది.

IAS
అయ్యా.. ఎస్‌ అంటే అంతే.. ప్రజాప్రతినిధుల మాటలకు అధికారుల జీ హుజూర్‌
author img

By

Published : Apr 3, 2022, 7:16 AM IST

వారు ఐఏఎస్‌లు.. బ్యూరోక్రసీలో తిరుగులేని అధికారులు.. చట్టాలు చేయడానికి ఇచ్చే సలహాల నుంచి వాటి అమలు వరకూ వారికి విస్తృతాధికారాలు ఉన్నాయి. వారు కాదంటే ఒక్కోసారి మంత్రులూ ఏమీ చేయలేరు. అంతటి కీలకమైన అధికారులు ప్రభుత్వం చేసే తప్పుల కారణంగా తలవంచుకోవాల్సి వస్తోంది. న్యాయస్థానాల ముందు దోషులుగా నిలవాల్సి వస్తోంది. కోర్టుధిక్కరణ కింద 8మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు ఇటీవల హైకోర్టు రెండు వారాల జైలుశిక్ష విధించడం.. వారి క్షమాపణలతో దాన్ని సేవా శిక్షగా మార్చడం ఆ కోవలోనిదే. పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరగకుండా చూడాలని ఆదేశించినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే కోర్టు ఆగ్రహానికి కారణం. ఈ ఘటనలో రాజకీయ నిర్ణయాలదే ప్రధాన పాత్ర. దిగువస్థాయి అధికారులు చర్యలు చేపట్టేలా ఐఏఎస్‌లు చూడాలి. కానీ ప్రభుత్వానికి అనుకూలంగానో... అసహాయత వల్లో వారీ పని చేయలేకపోయారు. ఇదే కాదు.. అనేక వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఉన్నతాధికారులు కోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇదివరకు ఏవో అసాధారణ కేసుల్లోనే కోర్టు మెట్లు ఎక్కే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు... ఇప్పుడు తరచూ కోర్టుల్లో తలొంచుకుని నిల్చోవాల్సి వస్తోంది.

* పదవీ విరమణ చేసిన ఒక ఉద్యోగికి పింఛను, ఇతరాలు ఇవ్వనందుకు.. అవి ఇచ్చేంతవరకూ, ప్రతి వాయిదాకీ కోర్టుకు రావాలని ఒక శాఖ కార్యదర్శిని ఇటీవల కోర్టు ఆదేశించింది. సీఎఫ్‌ఎంఎస్‌లో క్లియర్‌ కాలేదని చెప్పగా.. ఆ సదుపాయాలు ఇవ్వాల్సిన బాధ్యత కార్యదర్శిదేనని, ఆ పని పూర్తయ్యేవరకూ కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.

* గుత్తేదారులకు బిల్లులు చెల్లించనందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

* విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును నిర్బంధించిన కేసులో అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను హైకోర్టు పిలిపించడంతోపాటు, సీఆర్‌పీసీలో ఏముందో అక్కడే చదవాలని చెప్పింది.
ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన శంకరన్‌, యుగంధర్‌, మాధవరావు, పీపీఆర్‌ విఠల్‌... ఇలా ఎందరో మేరునగ ధీరుల్లాంటి ఐఏఎస్‌లు అధికార వ్యవస్థకే వన్నెతెచ్చారు. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ, నిజాయతీతో పనిచేసి చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి అధికారులు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? గతంలో ఎన్నడూ లేనంతగా... ఇటీవలే అధికార వ్యవస్థ ఎందుకిలా తలదించుతోంది? అఖిల భారత సర్వీసుల అధికారులకు రాజ్యాంగం పూర్తి రక్షణ కల్పిస్తోంది. తప్పు లేనప్పుడు ఒక ఐఏఎస్‌ అధికారిని ముఖ్యమంత్రీ సస్పెండ్‌ చేయలేరు. బిజినెస్‌ రూల్స్‌, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పని చేయడం తమ ప్రాథమిక విధి అని తెలిసీ... ఐఏఎస్‌ అధికారులు ఎందుకు గాడి తప్పుతున్నారు? ప్రజాప్రతినిధులు చెప్పినదానికల్లా తలాడిస్తూ... కార్యనిర్వాహక వ్యవస్థకే ఎందుకు తలవంపులు తెస్తున్నారు? పాలకుల మెప్పు పొంది మంచి పోస్టింగులు పొందాలనా..? వారంటే భయమా? మనకెందుకు వచ్చిన తలనొప్పి... చెప్పినట్టు చేస్తే పోలా అన్న నిర్లిప్తతా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని అత్యున్నత హోదాల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.

ఇంత అస్తవ్యస్త పాలన ఎప్పుడూ చూడలేదు: ‘ఇంత అస్తవ్యస్త పాలన చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చాక... రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగ వ్యవస్థలేంటి? చట్టసభను నేనే.. కార్యనిర్వాహక వ్యవస్థనూ.. న్యాయవ్యవస్థనూ నేనే.. నేను చెప్పిందే జరగాలన్న భావన పాలకుల్లో ప్రబలిపోయింది. సర్వాధికారాలు మీవేనని అధికారులూ వారికి చెప్పడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అంతా ఔరంగజేబు పాలనలా నడుస్తోంది. ఔరంగజేబు హయాంలో ఆయన ఉదయమే లేచి ఫలానా రాజ్యం మీద దండయాత్ర చేద్దామంటే చేసేయడమే. దౌలతాబాద్‌ వెళ్దామంటే వెళ్లిపోవడమే. ఎవరికైనా వెయ్యి ఎకరాలు ఇచ్చేద్దాం... ఫర్మానా జారీ చేయాలంటే చేసేయడమే. రాష్ట్రంలోనూ అంతే! ఇదివరకు ఐఏఎస్‌లు బిజినెస్‌ రూల్స్‌, ఫైల్స్‌, నోట్‌ ఫైల్స్‌ వంటి వాటిని తు.చ. తప్పక పాటించేవారు. ఇప్పుడు అవేవీ లేవు. అంతా నోటి మాట మీదే జరుగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిందల్లా చేయడానికి కొందరు అధికారులు వెనకడుగు వేసినా తోటి అధికారుల్లోనే కొందరు వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి రాచరిక వ్యవస్థలో ఐఏఎస్‌ వ్యవస్థా నిర్వీర్యం అయిపోయింది. అది మళ్లీ గాడిన పడుతుందని నేననుకోవడం లేదు’ అని అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన ఒక విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

బదిలీ చేస్తారనో, పోస్టింగ్‌ ఇవ్వరనో భయపడితే ఎలా?: ‘ఐఏఎస్‌ అధికారులు శిక్షణ సమయంలోనే భయం, పక్షపాతం, బంధుప్రీతి లేకుండా పని చేస్తామని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తారు. వారికి విధి నిర్వహణలో ఏ సందేహం వచ్చినా రాజ్యాంగాన్నే చూసుకోవాలి. మా చర్యలు రాజ్యాంగబద్ధంగా లేవన్నప్పుడు బాధితులు కోర్టుకు వెళతారు. కోర్టు తీర్పును అమలుచేసి తీరాలి. అమలు చేయవద్దని మౌఖిక ఆదేశాలు వస్తే... అది ముఖ్యమంత్రయినా, ప్రధాన మంత్రయినా కూడా... 24 గంటల్లోగా లిఖితపూర్వక ఆదేశాలివ్వాలని అధికారులు అడగాలి. మరీ ఒత్తిడి చేస్తే సెలవుపై వెళ్లాలి గానీ, తలొగ్గకూడదు. ఆదేశాలు అమలు చేయకపోతే బదిలీ చేస్తారేమో, పోస్టింగ్‌ ఇవ్వరేమోనని భయపడి తప్పుడు పనులు చేస్తే అధికారులే బాధ్యులవుతారు. ఐఏఎస్‌లు మనసావాచా కర్మణా నిజాయతీగా పనిచేయాలి’ అని మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేర్కొన్నారు.

సీఎస్‌ కార్యాలయంపై సీఎంవో పెత్తనం

అధికార వ్యవస్థ మొత్తం సీఎస్‌ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వ విధానాల్ని, నిబంధనల్ని ఏ శాఖా అతిక్రమించకుండా చూడాల్సిన బాధ్యత సీఎస్‌దే. ఒక ఉద్యోగిపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోర్టు ఆదేశించాక.. మంత్రి దాన్ని అంగీకరించకపోయినా ఆ శాఖ కార్యదర్శి ద్వారా అమలుచేయించే అధికారం సీఎస్‌కు ఉంటుంది. కానీ ఇప్పుడు సీఎస్‌ కార్యాలయానికి అధికారాలేమీ లేవు. సీఎస్‌ కార్యాలయంపై సీఎంవో పెత్తనం పెరిగిపోయింది. అన్నిశాఖల కార్యదర్శుల వ్యవహారాలూ సీఎంవోనే పర్యవేక్షిస్తుండటంతో.. సీఎస్‌కు వాళ్లపై నియంత్రణ లేకుండా పోయింది. అధికార వ్యవస్థ గాడి తప్పడానికి ఇదీ ఓ ప్రధాన కారణమని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

సలహాదారుల వ్యవస్థ వచ్చాక అంతా భ్రష్టుపట్టింది: ‘వ్యవస్థలో ఈ రుగ్మతలకు కారణం నాయకుల ప్రభావం బాగా పెరిగిపోవడమే. మేం ఏం చెప్పినా అడ్డు ఉండకూడదన్న ధోరణికి నాయకులు వచ్చేశారు. సలహాదారుల వ్యవస్థ మొదలైనప్పటి నుంచీ అధికారాలన్నీ వారి చేతుల్లో, సీఎంవో చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు. విలువలకు కట్టుబడి, అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోవడం. నాయకులు చెప్పినట్టు చేస్తూ ఆ వ్యవస్థలో భాగమై లబ్ధి పొందడం. ఎక్కువమంది రెండోదానికే మొగ్గు చూపుతున్నారు. ఎవరైనా ఒక అధికారి పైవాళ్లు చెప్పిన పని చేయకపోతే... ఆ పని చేయడానికి 100 మంది సిద్ధంగా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తమకు కావల్సినవారిని తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఒక ముఖ్యమంత్రి... తితిదే ఈవోకు ఫోన్‌ చేసి వేరే ఊళ్లో ఉన్న దేవాలయానికి తితిదే నుంచి రూ.20 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. అది నిబంధనలకు విరుద్ధమని అధికారి చెబితే... నిన్ను అక్కడ పెట్టింది అందుకే కదా అన్నారు. రాజకీయ వ్యవస్థ అలా ఉన్నప్పుడు ‘అయ్యా.. ఎస్‌’ అనే అధికారులే ఎక్కువమంది ఉంటారు. అధికారులు అవినీతిపరులైనప్పుడు.. రాజకీయ నాయకులు చెప్పిన తప్పుడు పనుల్ని చేయబోమని చెప్పే నైతిక స్థైర్యం కోల్పోతారు. అధికారుల్లో లోపం ఉన్నప్పుడు కొందరు నాయకులు బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు సిద్ధమవుతారు.’ - ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదు: ‘ప్రభుత్వ నిర్ణయాల్లో పరిపక్వత ఉండటం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలకు సంబంధించి తప్పుడు తడకల జీవోలు ఇస్తున్నారు. దానివల్ల బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టేస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రుల నిర్ణయాల్లో లోపాలుంటే అధికారులు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అధికారులకు లక్షల్లో జీతాలు ఇస్తోంది నిష్పక్షపాతంగా సలహాలిస్తారనే కదా..! ఇప్పుడది జరగడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక స్తబ్ధత వచ్చేసింది. ఎవరూ మాట్లాడం లేదు. దాంతో పొరపాట్లు జరుగుతున్నాయి. కోర్టు గడప ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాల్ని కోర్టు కొట్టేస్తుందని ముందే తెలిసిపోతోంది. అధికారులకు ధైర్యం అనే విటమిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలేమో. రాజ్యాంగంలోని 309, 310, 211 అధికరణలు అఖిలభారత సర్వీసుల అధికారులకు పూర్తి రక్షణ కల్పించాయి. ఒక ఐఏఎస్‌ అధికారి తన మాట వినకపోతే ముఖ్యమంత్రి ఆయనను మరో శాఖకు బదిలీ చేయగలరేమో గానీ, సస్పెండ్‌ చేయలేరు. అలాంటివాటికి సిద్ధంగా ఉండాలని ఐఏఎస్‌లకు శిక్షణలోనే చెబుతారు. అధికారులకు బిజినెస్‌ రూల్స్‌ తెలియాలి. వాటిని మంత్రులకు వారే నేర్పించాలి. మంత్రి మొండిగా వ్యవహరిస్తే... అధికారి తన అభిప్రాయాన్ని దస్త్రంపై రాయాలి. తప్పు చేసిన అధికారులు పదవీవిరమణ తర్వాతా తప్పించుకోలేరు. గతంలో అధికారులు తమ అభిప్రాయాల్ని ముఖ్యమంత్రులకూ ధైర్యంగా చెప్పేవారు. ఎన్టీఆర్‌ను ముక్కోపి అంటారు. ఏదైనా పని నిబంధనలకు విరుద్ధమని, చేయకూడదని ఆయన కార్యదర్శి యూబీ రాఘవేంద్రరావు చెబితే.. రామారావు నొచ్చుకునేవారేగానీ చేసేవారు కాదు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఫలానా పని చేయడం రాజ్యాంగ విరుద్ధమని అధికారులు చెబితే చెన్నారెడ్డి వంటి వాళ్లూ గింజుకునేవారే గానీ చేసేవారు కాదు.’ - ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్‌

గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు: ‘హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం, ఎందుకు అమలు చేయలేకపోతున్నామన్న విషయాన్ని కోర్టుకు చెప్పకపోవడం బాధ్యతారాహిత్యం. గతంలో కొందరు అధికారులకు ఎదురైన చేదు అనుభవాల నుంచి మిగతా అధికారులు పాఠాలు నేర్చుకోలేదు. 2012, 2013 సంవత్సరాల్లో సీబీఐ కేసుల్లో కొందరు అధికారులు జైలుకు వెళ్లినప్పుడు మిగతావారు ఆందోళన, ఆవేదన చెందారే తప్ప ఆలోచించలేదు. అధికారులు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? పొరపాటు వ్యవస్థదా? వ్యక్తులదా అని కలిసి కూర్చుని మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో హత్య జరిగినా ఆయనకు చెప్పకుండా కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అధికారులూ ఇబ్బంది పడటం ఎందుకన్న ధోరణికి వచ్చేశారు. ఒక మనిషికి క్యాన్సర్‌ సోకితే.. అతనికి జ్వరం రావొచ్చు. కడుపు నొప్పి రావొచ్చు. అవన్నీ ఆ వ్యాధి లక్షణాలు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ మన వ్యవస్థలకు సోకిన వ్యాధి లక్షణాలే.’ - పి.వి.రమేశ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

అధికారులకు ఇదో పాఠం: ‘ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో రెండు జట్లూ సక్రమంగా ఆడితే రిఫరీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరైనా తప్పు చేస్తే రిఫరీ ఎల్లో కార్డు చూపిస్తారు. ఇంకా అలా చేస్తుంటే రెడ్‌కార్డు చూపించి బయటకు పంపేస్తారు. కోర్టులు చేసేదీ రిఫరీ పనే. అధికారులు కచ్చితంగా నిబంధనలను పాటించాలి. లేనప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది. అన్ని వ్యవస్థల్లాగే ఇక్కడా ప్రమాణాలు తగ్గాయి. నాయకులకు లొంగిపోతున్నారు. నాయకులు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే.. కోర్టులో ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడేందుకు వారు రారు. ప్రతి అధికారీ ఫైలుపై కచ్చితంగా స్పీకింగ్‌ ఆర్డర్స్‌ రాయాలి. ఇదివరకు అధికారులు ఏ అంశంపై అయినా 3, 4 పేజీల అభిప్రాయం రాసేవారు. ఇప్పుడది లేదు. సెక్షన్‌ ఆఫీసర్‌ ఫైలు సిద్ధం చేస్తే సంతకాలు పెట్టేస్తున్నారు. గేట్‌మన్‌ తప్పు వల్ల రైలు ప్రమాదం జరిగితే.. బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి రాజీనామా చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సచివాలయ భవనాల నిర్మాణాన్ని కోర్టు తప్పుబట్టినందుకు... సంబంధిత మంత్రులెవరూ ఇప్పుడు రాజీనామా చేయరు కదా? దీన్ని అధికారులు ఒక పాఠంగా నేర్చుకోవాలి. నేను సీబీఐ నుంచి బదిలీ అయి... సొంత కేడర్‌కు మహారాష్ట్ర వెళ్లినప్పుడు పోస్టింగ్‌ కోసం హోం మంత్రిని కలవాలని అక్కడి డీజీపీ చెప్పారు. నేను కలవనని చెప్పాను. 8 నెలల పాటు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఏమవుతుంది? బ్యూరోక్రసీ సక్రమంగా నడవాలంటే అధికారులు నిర్భయంగా వ్యవహరించాలి.’ - లక్ష్మీనారాయణ, సీబీఐ పూర్వ జాయింట్‌ డైరెక్టర్‌

పాలకులకు చెప్పేవాళ్లేరీ?: ‘రాష్ట్ర ఎన్నికల కమిషనరును తొలగించే అధికారం పార్లమెంటుకే ఉంది. అదీ ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని రుజువైతేనే అవిశ్వాసం పెట్టి తొలగించగలదు. రాష్ట్ర ఎన్నికల కమిషనరును తొలగించేందుకు దస్త్రం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు... అలాంటి నిబంధన లేదని కార్యదర్శి చెప్పాలి. కానీ చెప్పలేదు. బ్యూరోక్రసీ నాయకులకు లొంగిపోయింది. ప్రజాప్రతినిధులు చెప్పినట్టల్లా తలాడిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అధికారుల్లో ఇన్‌సైడర్‌, అవుట్‌సైడర్‌ అన్న కేటగిరీలు వచ్చాయి. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండేవారు ఇన్‌సైడర్లు. వారికే మంచి పోస్టులు దక్కుతున్నాయి. మిగతావాళ్లు అవుట్‌సైడర్లే. వారు ఎంత ప్రతిభావంతులైనా.. అప్రాధాన్య పోస్టుల్లోనే ఉండిపోతున్నారు’ అని మరో విశ్రాంత అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాలకు.. ఐఏఎస్ అధికారుల కొరత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.