ETV Bharat / city

Kesineni Nani: భోగాపురం ఎయిర్​పోర్టు పనులకు ఎన్​ఓసీ ఇవ్వండి: ఎంపీ కేశినేని

Kesineni Nani: భోగాపురం ఎయిర్​పోర్టుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేసి, తక్షణమే దాని నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరావు ఉన్నప్పుడు దీనికి భూమిని కేటాయించారని తెలిపారు. ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని స్వాధీనం చేయడానికి ఎన్​ఓసీ తీసుకున్నారని, అయితే నిరభ్యంతర పత్రాన్ని నవీనకరించలేదన్న కారణంతో ఈరోజు వరకు పనులు ప్రారంభించలేదని వెల్లడించారు.

Kesineni Nani on bhogapuram airport
భోగాపురం ఎయిర్​పోర్టు పనులకు ఎన్​ఓసీ ఇవ్వండి
author img

By

Published : Mar 23, 2022, 9:14 AM IST

Kesineni Nani: భోగాపురం ఎయిర్​పోర్టుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేసి, తక్షణమే దాని నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్​సభలో పౌర విమానయానశాఖ బడ్జెట్ పద్దులపై మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్​పోర్ట్ నిర్మాణానికి 2,700ఎకరాల భూమిని సేకరించారు. కేవలం 35ఎకరాలే స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరావు ఉన్నప్పుడు దీనికి భూమిని కేటాయించారు. ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని స్వాధీనం చేయడానికి ఎన్​ఓసీ తీసుకున్నారు. నిర్మాణ బాధ్యతలను బిడ్డింగ్​ ద్వారా జీఎంఆర్​కు అప్పగించారు. అయితే నిరభ్యంతరపత్రాన్ని నవీనకరించలేదన్న కారణంగా ఈరోజు వరకు పనులు ప్రారంభించలేదు.

కేెంద్రం తక్షణమే దాన్ని నవీనకరించాలని విన్నవిస్తున్నా. విజయవాడ ఎయిర్​పోర్ట్ విస్తరణకు మా నాయకుడు చంద్రబాబు రైతుల నుంచి 750ఎకరాలు సేకరించి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఎయిర్​పోర్ట్​ కోసం సేకరించిన భూమికి ప్రతిఫలంగా రైతులకు భూమి కేటాయించకపోవడంతో చాలా కేసులు దాఖాలయ్యాయి. కేంద్రం జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి అని కేశినేని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

CPS: ఏప్రిల్​ 4 నుంచి సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.