ఈ ఫొటో చూడండి.. ఫ్రూట్స్ ఎంత కలర్‌ఫుల్ గా ఉన్నాయో కదా! వీటిపేరు గ్యాక్ ఫ్రూట్. వీటిని పండిస్తున్నది ఇతనే. పేరు జోజో పున్నక్కల్. ఊరు కేరళలోని అమలాపురం. ఓసారి మిత్రుడు ఈ పండ్ల గురించి చెప్పడంతో.. జోజోకు వాటిపై ఆసక్తి కలిగింది. దీంతో.. పలు ప్రాంతాలు తిరిగి ఆ విత్తనాలను సేకరించారు. అతను సేకరించిన అతికొద్ది విత్తనాలే.. ఇవాళ అతని జీవితాన్ని మార్చేశాయి.
2018లో జోజో తొలిసారిగా ఈ విత్తనాలను నాటాడు. కానీ.. అప్పటి వరకూ ఆ పండు రుచికానీ.. ఆ మొక్క రూపం గురించికానీ అతనికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత మొలకలు వచ్చాయి. మూడు నాలుగు నెలల్లో మొక్క పుష్పించడం ప్రారంభించింది. "ఆ తర్వాత కొనసాగించిన ఆన్లైన్ రీసెర్చ్ లో.. ఈ పంటను వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, లావోస్, సౌత్ చైనా, నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో విరివిగా పండిస్తున్నారని తెలుసుకున్నాను." అని చెప్పారు జోజో.
ఈ మొక్కల్లో.. ఆడ, మగ రెండు జాతులు ఉంటాయి. తప్పని సరిగా పక్కపక్కనే వీటిని నాటాల్సి ఉంటుంది. జోజో నాటిన ఆరు మొక్కలలో.. మూడు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. అయితే.. అవి కాయలు కాసేంత వరకూ ఏది మగదో.. ఏది ఆడదో గుర్తించం సాధ్యం కాదు అంటాడు జోజో. 2018 ఆగస్టులో విత్తనాలు నాటితే.. డిసెంబర్‌లో మొదటి పంట చేతికి వచ్చింది. పూత తర్వాత.. కాయకు మొత్తం నాలుగు దశలు ఉంటాయి. తొలి దశలో కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి. తర్వాత ఎల్లో, మూడో దశలో నారింజ రంగులోకి వస్తాయి.. చివరి దశలో ఎరుపు-నారింజ మిక్స్డ్ కలర్లోకి మారిపోతాయి. ఈ దశలో పూర్తిగా పండినట్టు లెక్క.
ఈ పండు ఒక్కొక్కటి కేజీ బరువు పైనే ఉంటుంది. దానిలోపల ముదురు ఎరుపు గుజ్జుతో కప్పబడిన బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి. ఒక మొక్క 50 పండ్లను మోయగలదు అని చెప్పారు జోజో. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు దిగుబడి పొందుతున్నట్టు తెలిపారు. ఈ మొక్కలు డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక పంట ఇస్తాయని.. ఆ తర్వాత తీగలను కత్తిరించడంతో.. రెండో దశ ప్రారంభం అవుతుందని చెప్పారు.
గ్యాక్ ఫ్రూట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపారు. పండ్లలో మాత్రమే కాకుండా.. ఈ మొక్క గింజలు, ఆకుల్లోనూ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయట. వీటిని చర్మం, కళ్ళకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో వినియోగిస్తారట. ఫేస్ క్రీమ్‌ల తయారీలోనూ వాడుతారని జోజో చెప్పారు. అయితే.. ఈ పండు తీపిగా ఉండదని.. అసలు ప్రత్యేకమైన రుచి ఏదీ ఉండదని చెప్పారు. చక్కెర లేదా తేనె వంటి ఇతర పదార్ధాలను మిక్స్ చేసుకొని జ్యూస్‌గా తీసుకోవచ్చని అన్నారు.
ఇక, ఈ పండ్లకు మార్కెట్ భారీగానే ఉంటుంది. కేజీ గ్యాక్ పండ్ల ధర రూ. 900 నుండి రూ. 1,200 మధ్య ఉంటుందట. అయితే.. ఇప్పటి వరకూ పండ్లను మార్కెట్ చేయలేదని చెప్పారు జోజో. తొలి నాళ్లలో విత్తనాల కోసం పండ్లన్నీ తనవద్దే ఉంచేసుకున్నాడు. వాటి ద్వారా.. మరిన్ని మొక్కలను పెంచాడు. అయితే.. ఇప్పుడు కూడా పండ్లన్నీ విత్తనాలకోసమే ఉంచుతున్నాడు. వాటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి.. కావాల్సిన వాళ్లకు విక్రయిస్తున్నాడు. ఒక ప్యాకెట్ లో మొత్తం 6 విత్తనాలు ఉంటాయి. అందులో.. 3 మగవి.. 3 ఆడవి. ఈ ప్యాకెట్ ను 300 రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ విత్తనాల ద్వారా సగటున ఏడాదికి రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టు చెప్తున్నాడు జోజో. ఇప్పటివరకు 3 వేల మందికి పైగా విత్తనాలను విక్రయించానని.. వారిలో 300 మంది వరకు ఇప్పటికే పండ్లను కోయడం కూడ మొదలు పెట్టారని చెప్పారు.
మంచి సూర్యకాంతి పడే పొడి వాతావరణం ఉన్న ప్రాంతంలో నాటి.. తగినంత నీటిని అందిస్తే.. ఈ మొక్కలు బాగా పెరిగి, మంచి దిగుబడి ఇస్తాయని చెప్పారు జోజో. ఈ గ్యాక్ పండ్ల సాగులో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరాగసంపర్కం కోసం ఆడ, మగ మొక్కలను కలిపి పెంచడం చాలా అవసరం. ఆ తర్వాత ఈ మొక్కలను మాన్యువల్‌గా జతచేయాల్సి ఉంటుంది. అప్పుడు.. రిజల్ట్ 90 శాతం వరకు వస్తుందని చెప్పారు. ఐదు ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అనేది సరైన నిష్పత్తి అని అన్నారు జోజో. ఆవు పేడ పొడిని ఎరువుగా వాడుతున్నట్టు తెలిపారు.
ఈ పండ్లకున్న డిమాండ్ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోందని.. చాలా మంది తన వద్దకు వచ్చి విత్తనాలు తీసుకెళ్తున్నారని చెప్పారు జోజో. ప్రస్తుతం తన ఇంటి టెర్రస్ తోపాటు.. చుట్టూ ఉన్న 60 సెంట్ల స్థలంలో 30కి పైగా గ్యాక్ పండ్ల మొక్కలను పెంచుతున్నారు. విత్తనాలను విక్రయిస్తూనే ఏడాదికి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్న అతను.. రాబోయే రోజుల్లో పండ్లను కూడా అమ్మడం ద్వారా మరింత ఇన్కమ్ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. వ్యవసాయమైనా.. మరేదైనా బిజినెస్ అయినా.. మూస పద్ధతులను అనుసరిస్తే పెద్దగా లాభం ఉండదు. ఇలా.. వినూత్న పద్ధతుల్లో ముందుకెళ్లినప్పుడే సక్సెస్ సొంతమవుతుంది. మరి, ఛాన్సుంటే.. మీరూ ఓసారి ట్రై చేయండి.
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- అర్జెంటుగా లావు తగ్గాలా..? వాళ్లు చిటికెలో పిండేస్తారు..!!
- "యమధర్మా.. వచ్చుచుంటిని.." ఫుల్లుగా తాగి నదిలో దూకేశాడు!
- వీళ్ల పెళ్లి జరుగుతుంది మళ్లీ.. మళ్లీ.. మూడేళ్లకోసారి విడాకులు!!
- పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!