ETV Bharat / city

విద్యుత్తు సవరణ చట్టంపై కేసీఆర్ గుస్సా - kcr letter to modi

ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగసంస్థలకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ ముసాయిదా బిల్లు-2020ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం లేఖ రాశారు. కేంద్ర ప్రతిపాదిత బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు.

kcr wrote a letter to pm modi for Should be withdrawn electricity amendment act
విద్యుత్తు సవరణ చట్టంపై ప్రధానికి కేసీఆర్ లేఖ
author img

By

Published : Jun 3, 2020, 7:15 AM IST

ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లులో తమకు అభ్యంతరకరంగా ఉన్న అంశాలను సీఎం లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణా మండలి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం సహా ప్రత్యేక పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం... రాష్ట్రాల అధికారాలను లాక్కోవడమేనని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను చట్టాల ద్వారా పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవడం సరికాదని... ఈ తరహా వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతీయ పునరుత్పాదక ఇంధన విధానాన్ని రాష్ట్రాల ఆమోదంతో చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాల్లో ఉండే విభిన్న పరిస్థితుల వల్ల విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ప్రతిపాదిత సవరణ వల్ల ఎన్ఎల్డీసీ బలోపేతం అవుతుందని... తద్వారా రాష్ట్రాల బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల యూనిట్లు కేంద్రానికి చెందిన ఎన్టీపీసీ, ఎన్​హెచ్​పీపీ లాంటి వాటితో పోటీ పడలేవని, అప్పుడు వాటికి తగిన ప్రాధాన్యత ఉండదన్నారు. అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా నిర్ణయాలను ఎస్ఎల్డీసీలకే వదిలేయాలని సూచించారు. చెల్లింపుల భద్రత అమలు లాంటి అధికారాలను ఎన్ఎల్డీసీకి ఇవ్వడం సబబు కాదని, కేవలం షెడ్యూలింగ్, సామర్థ్యం లాంటి సాంకేతిక అంశాలను మాత్రమే ఎన్ఎల్డీసీకి ఉండాలని సూచించారు.

బహిరంగ వేలంలో అందరికీ ఉచితంగా అవకాశం కల్పించడం ద్వారా ఒక మెగావాట్ కంటే ఎక్కువ ఉండే వినియోగదారులు కూడా వేలంలో పాల్గొంటారని కేసీఆర్​ పేర్కొన్నారు. సబ్ లైసెన్సీలు కూడా రిటైల్ మార్కెట్​లో విక్రయించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా డిస్కంలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రాయతీలను ప్రత్యేక నగదు బదిలీ ద్వారానే ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాము తీవ్ర వ్యతిరేకమని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నందున... రాయతీ చెల్లింపు విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టాలని కోరారు.

ఎలాంటి రాయతీలు లేకుండా కమిషన్ టారిఫ్ నిర్ణయించే ప్రతిపాదన వల్ల వినియోగదారులపై భారం పడుతుందని, ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ నియంత్రణా మండలి నియామకానికి సంబంధించి రాష్ట్రాల అధికారాలు లాక్కోవడంతో పాటు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్​ఫోర్స్​మెంట్ అథారిటీ పేరిట సమాంతర వ్యవస్థను తీసుకురావడం వల్ల వివాదాలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదనలు ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నందున వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'నిసర్గ'పై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.