కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంత ఆశాజనకంగా ఉన్నా.. రాష్ట్రాన్ని పూర్తిగా నిరాశ పరిచిందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ లేదని చెప్పారు. పోలవరం నుంచి విభజన హామీల వరకూ దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రాలను కలుపుకుని వెళ్లకపోతే ఎంత బడ్జెట్ అయినా సంతృప్తి ఉండదని చెప్పారు. రాష్ట్రానికి రైల్వే, ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయించకపోవడం సరికాదన్నారు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఇదీ చదవండి : బడ్జెట్ 2020: ఇకపై ఈ వస్తువులు మరింత ప్రియం