ETV Bharat / city

ఐటీ గ్రిడ్​ కేసు నిందితులను అరెస్ట్ చేయండి: కన్నా - bjp president kanna letter to cm jagan news

ముఖ్యమంత్రి జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. హైదరాబాద్​ ఐటీ గ్రిడ్ కేసులో ఏపీ ఓటర్లకు చెందిన సమాచార చోరీ ఘటన నిందితులను అరెస్టు చేయాలని కోరారు.

kanna letter to cm jagan on IT grid case

author img

By

Published : Dec 7, 2019, 2:05 PM IST

ఐటీ గ్రిడ్​ కేసు నిందితులను అరెస్ట్ చేయండి: కన్నా

హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్‌ సంస్థ కేసులో ఏపీ ఓటర్లకు చెందిన సమాచార చోరీ ఘటన నిందితులను అరెస్టు చేయాలంటూ సీఎం జగన్‌కు....భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. యూఐడీఏఐ సైతం 7.8 కోట్ల ఓటర్ల సమాచారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలకు చెందిన సమాచారం చోరీకి గురైన వాటిలో ఉన్నట్లు వెల్లడైందన్నారు. మార్చిలో జరిగిన ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి, ఐటీ గ్రిడ్ సంస్థ చీఫ్ అశోక్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని కన్నా పేర్కొన్నారు. కోట్లాది మంది సమాచారాన్ని చోరీ చేసిన వ్యక్తి అరెస్టుకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఆకస్మికంగా ముగిసిన సీఎం దిల్లీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.