ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో ప్రస్తుత పీజీ వైద్య ప్రవేశాల్లో మన విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ఉన్నత వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారన్నారు. ప్రవేశాలతో పాటు వివిధ ఉద్యోగ ఎంపికల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని.... లేఖలో కన్నా లక్ష్మీ నారాయణ కోరారు.
ఇదీ చదవండి: