ETV Bharat / city

KAMALANANDA BHARATHI SWAMI IN TENALI : "మూడు రాజధానులతో.. మూడు రాష్ట్రాల డిమాండ్ రావొచ్చు" - yamini-talks-about-three-capitals-for-andhra-pradesh

మూడు రాజధానుల ఏర్పాటుతో ప్రజల్లో విభజన భావన పెంచినట్లవుతుందని భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి(kamalananda Bharati swami in tenali) అన్నారు. దీనివల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని భాజపా నాయకురాలు సాధినేని యామినీశర్మ తెలిపారు.

భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి
భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి
author img

By

Published : Nov 28, 2021, 8:29 PM IST

భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి

మూడు రాజధానుల ఏర్పాటుతో(three capitals of andhra pradesh) దేశ సమగ్రతకు, సమైక్యతకు ఇబ్బంది కలుగుతుందని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని భువనేశ్వరిపీఠం పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు.

రాజధాని విషయాన్ని ఒక రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన విషయంగా కాకుండా.. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండేలా అభివృద్ధి(state development with one capital) చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు, పార్టీలు శాశ్వతం కాదని.. సమాజం శాశ్వతమని గుర్తుంచుకోవాలని సూచించారు. చెరువులు, వాగులు, వంకలు ఆక్రమణకు గురవడంతో వర్షపు నీరు బయటకు పోయే అవకాశం లేక వరదలు వస్తున్నాయని కమలానంద భారతి స్వామీజీ అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానుల బిల్లును మళ్లీ రూపొందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన.. ముందు ముందు రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించాలనే ఉద్యమానికి పురిగొల్పుతుంది. భారతదేశ సమగ్రత, సమైక్యత, అఖండతకు ఇది సరికాదు. అభివృద్ధి కార్యక్రమాలను వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దీనికి మూడు రాజధానులు చేయాలనుకోవడం సరికాదు.

-కమలానంద భారతి, భువనేశ్వరి పీఠం అధిపతి

మాట మార్చడం సరికాదు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర మోర్చా మహిళా కార్యదర్శి సాధినేని యామిని శర్మ(sadineni Yamini Sharma) మాట్లాడుతూ... మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్​కు రాజధానిగా అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని.. అమరావతికే తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.

నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. అమరావతిని రాజధానిగా అంగీకరించి, నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చడం సరికాదని అన్నారు. 30 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజధాని రైతులు చేపట్టిన న్యాయస్థానం - దేవస్థానం కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు పలికిందని అన్నారు.

ఎన్నికలు పూర్తైన తరువాత మూడు ముక్కలాటగా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. భవిష్యత్ కోసం భూములిచ్చిన రైతులకు ఈ నిర్ణయం మానసిక క్షోభ కలిగిస్తోంది.

-సాదినేని యామినీ శర్మ, భాజపా నాయకురాలు

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.