కరోనా విపత్తును అదుపు చేయకుండా రాజకీయాలే ముఖ్యమన్నట్లు వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను యథేచ్చగా ఉల్లంఘిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వంలో ఉన్నది సలహాదారులా, స్వాహాదారులా అని కళా మండిపడ్డారు. కరోనా మహమ్మారి కట్టడిలో సలహాలు ఇవ్వకుండా కాలక్షేపం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైకాపా నేతలది నిరంకుశ పాలన అన్న కళా... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కరోనా వైరస్ మానవాళిపై విరుచుకుపడుతుంటే వైకాపా నేతలు ఒక పక్క ప్రకృతి వనరులు దోచుకుంటూ, మరోవైపు లాక్డౌన్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని ఆక్షేపించారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇదీ చదవండి: