పాత గుంటూరు ఠాణాపై దాడి కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో.. తనను విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తుందేమో చూద్దామని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే విచారణను ఈనెల 22కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
2018 మేలో పాత గుంటూరు పీఎస్‌పై దాడి జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ కొందరు ముస్లిం యువకులపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అందుకు సంబంధించిన విచారణను ఉపసంహరించేందుకు.. ఈ ఏడాది ఆగస్టు 12న హోంశాఖ జీవో జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ.. గణేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థాం.. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఎఫ్ఐఆర్ విషయంలో యథాతథస్థితి పాటించాలని ఆదేశించింది. ఠాణా మీద దాడి చేశారని పోలీసులే ఫిర్యాదు చేసినా, నిందితులపై విచారణ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. పిటిషనర్ తరపు న్యాయవాది పీఎస్పీ సురేశ్ కుమార్ వాదించారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: