సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీతోపాటు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మహమూద్ అలీ సహా మేయర్ విజయలక్ష్మీ ఘనంగా ఆహ్వానం పలికారు. అక్కడనుంచి నేరుగా రాజ్‌భవన్ వెళ్లిన ఆయనకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.
అంతకుముందు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమల శ్రీనివాసుడిని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఆ తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:RRR: రఘురామ కృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ భరత్ ఫిర్యాదు