ETV Bharat / city

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో కీలక మలుపు - Telangana latest news

Jubilee Hills gang rape case updates: తెలంగాణ లోని జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగేలా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర ఆధారాలతో పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

RAPE CASE
RAPE CASE
author img

By

Published : Sep 3, 2022, 7:08 AM IST

Jubilee Hills gang rape case updates: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువెైనల్​ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు(జేజేబోర్డు) అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.

రెగ్యులర్‌ న్యాయస్థానంలో విచారణ జరిగి నిందితులపై నేరం రుజువైతే కఠినశిక్షపడే అవకాశం కనిపిస్తోంది. మే28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌ నుంచి ఒక బాలిక (17)ను తీసుకెళ్లి ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. ఒకరు మినహా అయిదుగురు మైనర్లుగా తేలింది. వారిని జువైనల్ హోంకు తరలించారు.

ఈ కేసులో ఇప్పటికే నిందితులకు బెయిల్‌ లభించింది. అయితే నిందితులది క్రూరమైన చర్యగా భావించి వారికి జువెనైల్‌ కోర్టులో కాకుండా సాధారణ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే పోలీసులు జేజేబోర్డును ఆశ్రయించారు. సాధారణంగా 16 ఏళ్లు దాటిన బాలలుగనక క్రూరమైన నేరాలకు పాల్పడితే మేజర్లుగా పరిగణించి సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిపించేందుకు ఆస్కారముంది.

అసలేం జరిగిదంటే: మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా... మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్​ పోలీసులు.. విడతలవారిగా సాదుద్దీన్​తో పాటు మరో ఐదుగురు మైనర్లను జూన్ 5న తేదీన అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. రాజకీయ రంగు పులుముకోవటంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా శ్రమించి తగిన ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం చేసినట్టు నిరూపించేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను పోలీసులు సేకరించగా.. అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు.

ఈ కేసులో కీలక ఆధారాల కోసం.. అత్యాచారం చేసిన వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్‌కిన్‌లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగమ్‌లను ఫొరెన్సిక్‌ అధికారులు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. బాలిక దుస్తులపై దొరికిన నమూనాలు, కారులో లభ్యమైన ఆధారాలతో నిందితుల డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఒక్క కీలక ఆధారంతో.. అత్యాచారం వాల్లే చేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యం దొరికినట్టైంది. ఫోరెన్సిక్​ అధికారుల ఇచ్చిన నివేదిక వివరాలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు.

ఇదొక్కటే కాకుండా.. బాధితురాలి నుంచి రెండు సార్లు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. జైలులో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అటు.. సీసీటీపీ దృశ్యాలతో పాటు మైనర్ బాలురు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చరవాణీలను కూడా పోలీసులు పరిశీలించారు. అత్యాచారం జరిగిన సమయంలో అదే లోకేషన్‌లో వీళ్లందరి చరవాణీలు ఉన్నట్లు సాంకేతికత ఆధారాల ద్వారా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. లైంగిక పటుత్వ పరీక్షల్లోనూ నిందితులందరికీ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పోలీసులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.