ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం జగన్ ప్రకటించిన తర్వాత అమరావతిలో రైతులు ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో జనసేన నాయకుడు నాగబాబు రైతుల వద్దకు వెళ్లి మద్ధతు తెలుపుతూ...తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వం సేకరించిన 34వేల ఎకరాల్లో...5వేల ఎకరాలు అవకతవకలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోంది.. ఇది వాస్తవంగా జరిగి ఉండొచ్చు అని నాగబాబు అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేతలు చేసిన తప్పులకు దాదాపు 28వేల మంది రైతులు నష్టపోవడం కరెక్టా.. కాదా మీరు ఆలోచించాలని నాగబాబు అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి...'రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే... ఇదా బహుమతి..?'