ETV Bharat / city

తవ్వేదెంత? అమ్మేదెంత?.. గనులశాఖకు లెక్క తేలేది ఎలా?

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టిన జేపీ పవర్‌ వెంచర్స్‌ కొనుగోలుదారులకు సొంత వే బిల్లులు ఇస్తోంది. దాంతో గనులశాఖకు స్పష్టమైన లెక్క ఎలా తెలుస్తుందనేది ప్రశ్నార్థకమవుతోంది.

illegal sand excavations
రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు
author img

By

Published : Jun 8, 2021, 7:12 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టిన జేపీ పవర్‌ వెంచర్స్‌... కొనుగోలుదారులకు సొంత వే బిల్లులు ఇస్తోంది. దాంతో గనులశాఖకు స్పష్టమైన లెక్క ఎలా తెలుస్తుందనేది ప్రశ్నార్థకమవుతోంది. మొన్నటివరకు ఏపీఎండీసీ ద్వారా జరిగిన ఇసుక విక్రయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌తో పక్కాగా లెక్క ఉండేది. గత నెల 17నుంచి 140 రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ లేకుండా నేరుగా రీచ్‌ వద్దకు వెళ్లి ఇసుక కొనుక్కోవచ్చు. టన్ను ఇసుకకు రూ.475 చొప్పున చెల్లిస్తే, రెండు బిల్లులు ఇస్తున్నారు. వీటిలో ఒకటి ఇసుక లోడ్‌ చేసే సమయంలో అందజేయాలి. మరొకటి రవాణా చేసే లారీ డ్రైవర్‌ వద్ద వే బిల్లుగా ఉంటుంది.

ఈ బిల్లులు ప్రైవేటు సంస్థ పేరుతోనే ఉంటున్నాయి. ప్రైవేటు సంస్థకు ఇసుక బాధ్యతలు ఇస్తే, తవ్వకాలు, విక్రయాల వివరాలన్నీ ఏ రోజుకు ఆరోజు ఓ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారని గనులశాఖ వర్గాలు గతంలో చెప్పాయి. ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌ సిద్ధం కాలేదు. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అమ్ముడవుతుందని అంచనా. దాని కన్నా ఎక్కువగా విక్రయాలు జరిగితే ఈ సంస్థ టన్నుకు రూ.375 చొప్పున గనులశాఖకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రైవేటు సంస్థ జరిపే విక్రయాల లెక్క పక్కాగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'రేపటి నుంచి జూనియర్‌ డాక్టర్ల విధుల బహిష్కరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.