ETV Bharat / city

నేటి నుంచే జేఈఈ మెయిన్‌ పరీక్షలు

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 82,748మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

jee main exams
jee main exams
author img

By

Published : Sep 1, 2020, 6:26 AM IST

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 82,748మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తంగా 1,50,059మంది హాజరుకానున్నారు. ఆరో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ పరీక్ష ఉండగా.. రెండో తేదీ నుంచి బీటెక్‌, బీఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి 6గంటల వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్‌ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని పర్యవేక్షకులకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు.ఎడం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన వాటి వివరాలు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది.

* ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌ కార్డులో.. కొవిడ్‌-19 లక్షణాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణతో వివరాలు నమోదు చేసి వెంట తీసుకువెళ్లాలి. గత 14 రోజులుగా జ్వరం, దగ్గు, గొంతు, శ్వాస సమస్యలు లేవని పేర్కొనాలి. దానిపై ఫొటో అంటించి, సంతకంతోపాటు ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి.
* పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డు, ఇంటర్‌ రెండో ఏడాది రిజిస్ట్రేషన్‌ కార్డు, ఆధార్‌, పాస్‌పోర్టు తదితర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.
* హాజరు షీటుపై అతికించేందుకు అదనంగా ఫొటో, పెన్ను తీసుకువెళ్లాలి.
* వ్యక్తిగత శానిటైజర్‌(50ఎంఎల్‌), పారదర్శకంగా ఉండే నీటి సీసాను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

మెయిన్‌ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాక.. నిర్వాహకులు అందించే మాస్కులనే ఉపయోగించాలని అధికారులు నిర్దేశించారు.

ఇదీ చదవండి

'ప్రణబ్ దా'కు ఆంధ్రులతో ఆత్మీయ అనుబంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.