ఐఐటీ ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.. మళ్లీ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్షకు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 222 నగరాలు, పట్టణాల్లో వెయ్యి కేంద్రాల్లో దిల్లీ ఐఐటీ ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. లక్ష 60వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని... పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేదని దిల్లీ ఐఐటీ స్పష్టం చేసింది. మాస్కు ధరించాలని..సొంతంగా శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చునని సూచించింది. మధ్యాహ్నం పరీక్ష ప్రారంభమయ్యాక హాల్ టికెట్‌ను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలని.. లేనిపక్షంలో అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను అక్టోబరు 5న విడుదల కానున్నాయి. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చే నెల 8న నిర్వహించి.. 15న ఫలితాలు ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఇవీ చూడండి: