కరోనా కష్టకాలంలో ఆన్లైన్ విద్యాబోధన తప్పనిసరైన పరిస్థితుల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంట్లో టీవీలు లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో ఈ ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు. పాక్షిక అంధత్వం ఉన్న ముగ్గురు విద్యార్థులు తాము ల్యాప్‌టాప్ కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని జేడీ ఫౌండేషన్‌ను ఆశ్రయించారు.
విద్యార్థుల ఇబ్బందిని అర్ధం చేసుకున్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ వి.వి.లక్ష్మీనారాయణ వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు విద్య అని, దానికి ఆటంకం కలిగించకుండా తమ జేడీ ఫౌండేషన్ ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. సాయం పొందిన వారు వృద్ధిలోకి వచ్చాక.. ఇలాగే మరికొందరిని ఆదుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇవీ చూడండి: గురుగ్రామ్‌లో మరో నిర్భయ ఘటన