రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు కంట్రోల్ కేంద్రం ఛైర్మన్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణకు అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన జవహర్‌రెడ్డి.. కరోనా పరీక్షల ఫలితాలు ప్రతిరోజు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 48 గంటల్లో క్షేత్రస్థాయిలో ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు చేయాలని ఆదేశించారు. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు ద్వారా బ్యాక్‌లాగ్ సాంపిల్స్ క్లియర్ చేయాలన్న జవహర్‌రెడ్డి.. ప్రతి జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్ల ద్వారా 3 వేల బెడ్లు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. క్రయోజనిక్ ట్యాంకర్ల తయారీలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొవిడ్ మృతుల అంత్యక్రియలకు ప్రోటోకాల్ తయారు చేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు.
ఇదీ చదవండీ... 'కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళ్తే.. కాటికి పంపారు'