ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని కోరుతూ ఇప్పటికే భాజపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ జరపనుంది.
ఇదీ చదవండి:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్