NADENDLA: ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌ను.. అప్పుల కార్పొరేషన్‌గా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ కార్పొరేషన్ స్థాపించి.. 23 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారన్నారు.
16వేల 800 కోట్ల రూపాయులు చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాలకు వినియోగించారని.. మిగతా 6వేల కోట్లు ఏమయ్యాయో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రమంత్రి పార్లమెంటులో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.25వేల కోట్ల ఆదాయం వస్తోందని.. ఆ నిధులు ఎక్కడకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. గతేడాది కంటే మద్యం అమ్మకాలు 40శాతం పెరిగాయని.. వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పిన మద్యనిషేధం ఇదేనా? అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: