కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్నిరకాల పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.
పై చదువులకు వెళ్లేవారికి, క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఎంపికైన వారికి ధ్రువపత్రాలు అవసరమన్న ఆయన.. పరీక్షలు రద్దుచేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని అన్నారు. ఈ సందర్భంగా... మహారాష్ట్ర, ఒడిశాలోని పలు వర్సిటీలు పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: