-
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై దాడి గర్హనీయం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/VwzW9Z2S34
— JanaSena Party (@JanaSenaParty) November 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై దాడి గర్హనీయం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/VwzW9Z2S34
— JanaSena Party (@JanaSenaParty) November 22, 2020శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై దాడి గర్హనీయం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/VwzW9Z2S34
— JanaSena Party (@JanaSenaParty) November 22, 2020
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినుత కోటా ఇంటిపై దాడిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడటం, పోలీసులతో బాధితులపైనే కేసులు పెట్టించడమేమిటని ప్రశ్నించారు. దాడికి సంబంధించి వినుత కుటుంబంపైనే ఎదురు కేసు నమోదు చేయటంపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం అవుతోందన్నారు. చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు వైకాపా నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తే బాధితులకు న్యాయం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంలోనూ ఇదే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల సూచనలతోనే కొందరు పోలీసు అధికారులు తమ నేతలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి