ETV Bharat / city

'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి' - ఏపీ రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్

వైకాపా పాలనలో రోడ్లు అధ్వానంగా మారాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రోడ్లు మరమ్మతు చేయమంటే లాఠీ ఛార్జీలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ పరిస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.

'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'

author img

By

Published : Sep 1, 2021, 11:57 AM IST

'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'

అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రాష్ట్ర రహదారుల దుస్థితి అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రోడ్డు బాగు చేయమంటే వేధింపులు... లాఠీ ఛార్జీలు... అరెస్టులు చేయడాన్ని తప్పుపట్టారు. పాడైన రోడ్లను హ్యాష్‌ ట్యాగ్‌ జేఎస్పీ ఫర్‌ ఏపీ రోడ్స్‌ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. రహదారుల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించేలా చేయాలన్నారు. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: నేడు అప్పికట్ల జోసెఫ్‌ 25వ వర్ధంతి.. ఆయన పేరిట తపాలా కవరు, స్టాంపు ఆవిష్కరణ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.