ఏడాది పూర్తయిన రాజధాని నిరసనలు.. జనభేరి సభకు ముమ్మర ఏర్పాట్లు - గుంటూరు వార్తలు
అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఐకాస నేతలు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో 'జనభేరి' పేరుతో జరగనున్న సభకు... 30వేల మందికి పైగా రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సభ జరిగే తీరు, నిర్వహించే కార్యక్రమాలు, ప్రస్తుత ఏర్పాట్లపై పూర్తి సమాచారం.