ETV Bharat / city

ఫ్లెక్సీల నిషేదంపై స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan on the issue of flexi సీఎం జగన్ మోహన్​రెడ్డి కాలుష్య నిర్మూలన కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్​లో స్పందించారు. ముఖ్యమంత్రికి పర్యవరణంపై ఇప్పటికి ప్రేమ పుట్టిందా అంటూ వ్యంగంగా విమర్శించారు.

Pawan Kalyan on the issue of flexi
ఫ్లెక్సీల నిషేదంపై స్పందించిన పవన్ కల్యాణ్
author img

By

Published : Aug 27, 2022, 10:46 PM IST

Pawan Kalyan రాష్ట్రంలో ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై జనసేనాని పవన్​ కల్యాణ్​ స్పందించారు. ముఖ్యమంత్రికి పర్యావరణంపై ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టిందా అంటూ వ్యంగ్యంగా ట్విట్ చేశారు. విశాఖలో పారిశ్రామిక కాలుష్య నివారణకు కనీస చర్యలు లేవన్నారు. విష వాయువులు లీకేజీ అవుతూ ప్రజలు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. వాటికి కారణమైన వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి, ఇప్పుడు మాత్రం ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధిస్తున్నామనడం విడ్డూరంగా ఉందన్నారు. నీటి వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న కంపెనీల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలన్నారు. కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థల ద్వారా జరుగుతున్న హానిపై ప్రజా క్షేత్రంలో వివరిద్దామని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.