జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫార్మ్ లు అందించేందుకు 80 కోట్ల 43 లక్షల రూపాయల విడుదలకు ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ రెండు తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి యూనిఫార్మ్ జత కుట్టేందుకు 80 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర శిక్షణ పథకం కింద ఈ యూనిఫార్మ్ జతలను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం