గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకే అప్పగించే ‘జగనన్న పల్లెవెలుగు’ కార్యక్రమం ఈ నెల 31న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇంధనశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. లైట్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులు, పరిష్కారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఓ వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. మొత్తం ఈ ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (పీసీసిడ్కో) పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్), నెడ్‌క్యాప్ నుంచి బాధ్యతలను పంచాయతీలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10,382 పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఈ కార్యక్రమం పరిధిలో లేని మరో 2,303 పంచాయతీల్లో 4 లక్షల దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని