ETV Bharat / city

Jagananna house అమ్మకానికి జగనన్న ఇళ్ల స్థలాలు! - జగనన్న కాలనీల లబ్దిదారులు

plots for sale రాష్ట్రంలో పలు చోట్ల జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులు విక్రయానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉండటంతో అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం లేఅవుట్‌లో రూ.2 లక్షలకు ఓ లబ్ధిదారుడి నుంచి స్థలాన్ని కొనుగోలు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దాన్ని రూ.2.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు. అప్పు చేసి రూ.9 లక్షలు పెట్టి ఇంటిని పూర్తి చేసుకున్న మరో లబ్ధిదారుడు దాన్ని రూ.13 లక్షలకు అమ్మకానికి పెట్టారు.

Jaganna house plots for sale
అమ్మకానికి జగనన్న ఇళ్ల స్థలాలు!
author img

By

Published : Sep 6, 2022, 9:03 AM IST

Beneficiaries of Jagananna Colonies: రాష్ట్రంలో పలు చోట్ల జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులు విక్రయానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉండటంతో అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎలాంటి రాతపత్రాలూ లేకుండా మాట మీదనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరగడం.. ఇంటి నిర్మాణానికిగాను ఇస్తున్న రూ.1.80 లక్షల ఆర్థిక సాయం సరిపోకపోవడంతో కొంతమంది స్థలాలను అమ్ముకుంటున్నారు. ఇంటి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కూడా అమ్మకానికి మరో కారణంగా నిలుస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంతమంది పేదలు ఇప్పటికే పలు చోట్ల స్థలాలను అమ్మేసుకున్న పరిస్థితులూ క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అమ్మకం జరిగినా అధికారులకు అనుమానం రాకుండా లబ్ధిదారులే ముందుండి అన్ని పనులూ చేస్తున్నారు.

పేదల పరిస్థితిని ఆసరాగా తీసుకొని జగనన్న కాలనీలపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గద్దల్లా వాలుతున్నారు. లబ్ధిదారుల నుంచి చౌకగా స్థలాలను కొనుగోలు చేసి దానిపై మరింత లాభం పొందేలా ఇతరులకు కట్టబెడుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయి.. ప్రభుత్వ ఆర్థిక సాయం పూర్తిగా అందే వరకు లబ్ధిదారులు అందుబాటులో ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. నిర్మాణం పూర్తయ్యాక అద్దెకు ఇచ్చినట్లు ఉండేలా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల మేస్త్రీలే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాత్రను పోషిస్తున్నారు. అమ్మకాలు జరిగినట్లు ఆధారాలు ఉండేందుకు కొంతమంది బాండు పేపర్లు రాయించుకుంటున్నారు.

యూనిట్‌ వ్యయంలోనూ వాటాలు..

ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల ఆర్థిక సాయంలోనూ వాటాలు మాట్లాడుకుంటున్నారు. ఈ మొత్తం కొనుగోలుదారుడికే ఇస్తే స్థలానికి ఒక ధర..సగమిస్తే మరో ధరగా నిర్ణయించి బేరమాడుతున్నారు. విడతల వారీగా విడుదలయ్యే ఈ మొత్తం కొనుగోలుదారుడికి అందే వరకూ లబ్ధిదారుడే బాధ్యత తీసుకోవాలి.

ఇబ్రహీంపట్నంలో రూ.2 లక్షలకు విక్రయం..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం లేఅవుట్‌లో రూ.2 లక్షలకు ఓ లబ్ధిదారుడి నుంచి స్థలాన్ని కొనుగోలు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దాన్ని రూ.2.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు. ఇక్కడ ఇప్పటికే కొన్ని స్థలాలు అనధికారికంగా ఈ తరహా విక్రయాలు జరిగినట్లు అక్కడి లబ్ధిదారులే చెబుతున్నారు. అప్పు చేసి రూ.9 లక్షలు పెట్టి ఇంటిని పూర్తి చేసుకున్న మరో లబ్ధిదారుడు దాన్ని రూ.13 లక్షలకు అమ్మకానికి పెట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని నున్న లేఅవుట్‌లో ఇదే పరిస్థితి ఉంది. స్థలాలను కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని కాలనీ వద్ద తహసీల్దారు ఏకంగా హెచ్చరిక బోర్డునే పెట్టడం గమనార్హం. విజయనగరం జిల్లా గజపతినగరంలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారు. రహదారి పక్కన స్థలం ఉంటే అధిక ధర పలుకుతోంది. కాస్త లోపలగా ఉంటే ఓ మోస్తారు ధరలకు విక్రయిస్తున్నారు. కడప జిల్లాలోనూ పలు చోట్ల ఈ పరిస్థితి ఉంది. అయితే అమ్మకాలు జరిగినా జియో ట్యాంగింగ్‌ మొదలు ఫొటోలు, నిర్మాణ సామగ్రి కోసం సంతకాల వరకూ అన్నీ లబ్ధిదారుల ద్వారానే అధికారికంగా చేస్తున్నారు.

* ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని జగనన్న కాలనీ లేఔట్‌లో ఓ లబ్ధిదారుడు రూ.70 వేలకే పట్టాను అమ్మేశారు. ఇంటి నిర్మాణానికి భారీగా వ్యయం అవుతుండటంతో డబ్బున్నప్పుడు నిదానంగా కట్టుకోవచ్చనే ఆలోచనతో ఆ లబ్ధిదారు ఉన్నారు. అయితే ఇళ్లు కట్టుకోకుంటే పట్టా రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరించడంతో దిక్కుతోచని స్థితిలో ఆ స్థలాన్ని బేరానికి పెట్టి రూ.70 వేలకు విక్రయించారు. ఈ ఒక్కకాలనీలోనే దాదాపు 30 మందికిపైగా అనధికార ఒప్పందాలు చేసుకుని రూ.70వేల నుంచి రూ.1.70లక్షల వరకు ఇతరుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై అక్కడి గృహ నిర్మాణశాఖ అధికారులకు సమాచారం అందడంతో ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదించారు.

నిర్మాణ సామగ్రిని సైతం...

జగనన్న కాలనీల్లో ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లబ్ధిదారులు ప్రభుత్వమిచ్చిన ఇంటి నిర్మాణ సామగ్రిని విక్రయిస్తున్నట్లు బయటపడింది. సిమెంటు, ఇనుము, ఇసుకను ఇతరులకు అమ్మినట్లు గుర్తించారు. దాదాపుగా 100 మందికిపైగానే సామగ్రిని పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల విక్రయంపై గృహనిర్మాణశాఖ అధికారులను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అనధికార విక్రయాలకు సంబంధించి కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు.]

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.