జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య తుది జాబితా ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 41,46,844 మంది విద్యార్థులు తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. జనవరి 9 నుంచి వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులు 81.7 లక్షల మంది ఉండగా అందులో 65.1 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. విద్యార్థుల వివరాలను తల్లుల ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేసి 41.46 లక్షల మంది లబ్ధిదారులతో తుది జాబితా రూపొందించారు.
ఖాతాల్లో పేర్లు తప్పులు.. అనర్హులు
బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల 1.84 లక్షల మంది అనర్హులయ్యారు. 14.7 లక్షల మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉండడం, తల్లి, విద్యార్థుల ఆధార్ తప్పుగా ఉండడం, సర్కారు నిర్ణయించినదానికన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండడం, పథకం వద్దని చెప్పిన వారూ ఉన్నారు.
ఇదీ చూడండి: