ఫిబ్రవరి 28న 'జగనన్న విద్యా వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కంటివెలుగులో భాగంగా ఫిబ్రవరి 1నుంచి మూడో విడత కార్యక్రమం నిర్వహించనున్నట్టు పలు అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు.
ఫిబ్రవరిలో 4,906 కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అమ్మఒడిలో లక్షా 7 వేల మందికి నగదు బదిలీ కాలేదని గుర్తించామని సీఎం జగన్ వివరించారు. వారికి వెంటనే నగదు అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.
ఈ నెల 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభించనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలులో ఇసుక డోర్ డెలివరీ చేసేలా ఆదేశాలిచ్చారు. వర్షాకాలం వచ్చేసరికి 60 నుంచి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కువైట్లో చిక్కుకున్న మహిళలకు విముక్తి