వైకాపా సీనియర్ కార్యకర్త, పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి కలకడ శ్యాం మృతిపై వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఉంటున్న శ్యాం కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు.
శ్యాం భార్య సుప్రియకు సీఎం జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపా కార్యక్రమాల్లో శ్యాం క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. ఐటీ విభాగం, సామాజిక మాధ్యమాల్లోనూ, పార్టీ కార్యక్రమాల్లో శ్యాం చురుగ్గా పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: