చిత్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్‌కు చెందిన మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తున్నారు.
సినీ నటుడు నాని కార్యాలయంలోనూ ఐటీశాఖ తనిఖీలు చేస్తోంది. ప్రతిరికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.