ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పండ్లు, పాలు, కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు, చిరు, తృణ ధాన్యాల భాండాగారంగా ఏపీని సిద్ధం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం వెబ్‌నార్‌లో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి ...రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ వెబ్‌నార్‌లో కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి సిమ్రాన్ కౌర్ బాదల్, వివిధ రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రులు పాల్గొన్నారు.
'ప్రస్తుతం ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఏపీ కీలకంగా మారుతుంది. ప్రస్తుతం 8 వేలకుపైగా ఆహరశుద్ధి పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నాయి. పండ్లు, పాలు, కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు, చిరు, తృణ ధాన్యాల భాండాగారంగా ఏపీని సిద్ధం చేస్తున్నాం'- మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఇదీ చదవండి: