గురుకుల పాఠశాలల్లో ఆంగ్లోదయం కార్యక్రమంలో భాగంగా 'రీడ్ టు..' యాప్ను విజయవాడలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. 158 గిరిజన సంక్షేమ , 52 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇంటెల్ సంస్థలు.. ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి.
విద్యా సంస్కరణల్లో భాగంగా ఆంగ్ల మాద్యమాన్ని సీఎం ప్రారంభించారని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఆంగ్లం ప్రావీణ్యం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ యాప్ ద్వారా 87వేల మంది.. విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పిల్లల డిజిటల్ మీడియాలోకి ప్రవేశానికి ఆంగ్లోదయం ఉపయుక్తమవుతుందన్నారు. చిన్నారులను ఆంగ్ల విద్యలో ప్రావీణ్యులుగా తీర్చిదిదేందుకు.. ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ..గ్రామాల విలీనంపై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 20కి వాయిదా