ETV Bharat / city

పారిశ్రామిక పరివర్తన దిశగా ఏపీ: మంత్రి గౌతమ్ రెడ్డి

author img

By

Published : Oct 29, 2020, 5:41 PM IST

పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికే ఐఎస్​బీ భాగస్వామ్యంతో ముందుకువెళుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్​ సమీక్షలో పాల్గొన్న ఆయన... రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.

it minister  goutham reddy
it minister goutham reddy

రాష్ట్రంలో రిమోట్ వర్క్ విధానంపై త్వరలోనే వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికే ఐఎస్​బీ భాగస్వామ్యంతో ముందుకువెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ కేంద్రంగా ఫార్మా సహా పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ-గవర్నెన్స్ లో మరో స్థాయిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నైపుణ్యం పెంచడం, పాలసీ ల్యాబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నవంబర్‌ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం షెడ్యూల్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.