ETV Bharat / city

తెలంగాణలో.. కరోనా వైరస్‌ మళ్లీ జూలు విదిలిస్తోందా..?

తెలంగాణలో రెండో దశ ఉద్ధృతి ముప్పు పొంచి ఉందా? అనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి. అనుమానాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్రంలో కేసుల సంఖ్యా పెరుగుతోంది. కేవలం 16 రోజుల వ్యవధిలోనే దాదాపు 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. మరోసారి వైరస్​ ఉద్ధృతి పెరగక ముందే స్వీయ రక్షమ చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్‌ మళ్లీ జూలు విదిలిస్తోందా..?

author img

By

Published : Mar 18, 2021, 9:27 AM IST

హైదరాబాద్​లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో గత నెలలో 30 పడకల్లో కొవిడ్‌ బాధితులు చికిత్స పొందగా, ఈనెలలో గత 17 రోజుల్లోనే రోగుల సంఖ్య 80 దాటింది. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నవారి సంఖ్య కూడా దాదాపు రెండింతలు పెరిగినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. మంగళవారం నాటికి గాంధీలో 14 మంది ఆక్సిజన్‌ పడకల్లో, 39 మంది వెంటిలేటర్‌ పడకల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తరహా ఉదాహరణను పరిశీలిస్తే రాష్ట్రంలో రెండో దశ ఉద్ధృతి (సెకండ్‌ వేవ్‌) ముప్పు పొంచి ఉందా? అనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి.

16 రోజుల వ్యవధిలోనే..

గత నెల వరకూ కేరళ, మహారాష్ట్రలకే పరిమితమైన కొవిడ్‌ ఉద్ధృతి ఇప్పుడు నెమ్మదిగా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లకూ విస్తరించడంతో ఆ ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబరు నుంచి క్రమేణా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య.. ఈ నెలలో నెమ్మదిగా పెరుగుతుండడం.. అందులోనూ కేవలం గత 16 రోజుల వ్యవధిలోనే దాదాపు 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

పూర్తిగా జడలు విప్పకముందే..

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 16న 247 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన కొత్త కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత రెణ్నెళ్లుగా రోజుకు సగటున ఒకట్రెండు మరణాలు నమోదవుతుండగా.. ఈనెలలో రెండోసారి (10న, 16న) ఒక్కరోజులో 3 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ పూర్తిగా జడలు విప్పకముందే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

15 జిల్లాల్లో పెరుగుదల

పాజిటివ్‌ కేసులు కాస్త నెమ్మదించిన తరుణంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలకు నీళ్లొదలడంతో వైరస్‌ మళ్లీ జూలు విదిలిస్తోంది. వైరస్‌ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిఘా లేకపోవడమూ కేసుల పెరుగుదలకు కారణమని వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. మొదటి నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్న జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అదే ఒరవడి ఉండగా.. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ నగర.. తదితర 15 జిల్లాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

2 లక్షలు దాటిన వృద్ధుల టీకాలు

తెలంగాణలో మరో 23,895 మందికి కొవిడ్‌ తొలి డోసు టీకాను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ఈ నెల 16న(మంగళవారం) రాత్రి 9 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ టీకాల సమాచారాన్ని డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. తాజా పంపిణీతో వృద్ధుల్లో టీకాలు పొందినవారి సంఖ్య 2,00,838కి పెరగగా.. 45-59 ఏళ్ల మధ్యవయస్కుల కేటగిరీలో 73,400కు పెరిగారు.

టీకాలు, స్వీయ జాగ్రత్తలే రక్ష

కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఏమరుపాటుగా వ్యవహరిస్తే.. కొవిడ్‌ ఎవరినీ వదిలిపెట్టదు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో.. మనం ఇప్పుడు మరింత అప్రమ్తతంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లడాన్ని మానుకోవాలి. మాస్కును తప్పనిసరిగా, సక్రమంగా ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అర్హులందరూ తప్పనిసరిగా కొవిడ్‌ టీకాను పొందాలి. టీకా, స్వీయ జాగ్రత్తలే కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్రభుత్వ ముందస్తు చర్యల్లో భాగంగా రోజుకు 60 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించి, ఏమాత్రం అనుమానిత లక్షణాలున్నా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను చేయించుకోవాలి.

-డా. జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఇవీ చూడండి:

శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.