ETV Bharat / city

ఏపీ ఉత్తర్వుపై అభ్యంతరాలు వివరించాం: రజత్​ కుమార్​ - పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తాజా వార్తలు

కొత్త ఎత్తిపోతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ముందుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరినట్లు రజత్​ కుమార్​ వెల్లడించారు. కృష్ణా బోర్డు ఛైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​తో ఆయన భేటీ అయ్యారు. రజత్​తో పాటు ఈఎన్​సీ మురళీధర్​ కూడా ఉన్నారు. ఏపీ ఉత్తర్వుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు వివరించామని రజత్​ కుమార్​ పేర్కొన్నారు.

రజత్​ కుమార్​
రజత్​ కుమార్​
author img

By

Published : May 13, 2020, 7:49 PM IST

ఏపీ ఉత్తర్వుపై అభ్యంతరాలు వివరించాం: రజత్​ కుమార్​

కొత్త ఎత్తిపోతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ముందుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్​తో పాటు కృష్ణా బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్​ను రజత్ కుమార్ కలిశారు.

ఏపీ ఉత్తర్వుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు వివరించామని రజత్​ కుమార్​ వెల్లడించారు. ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేపట్టరాదన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జనవరిలోనే బోర్డు దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా గుర్తు చేసినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు.

చర్చలో అన్ని విషయాలపై మాట్లాడాం. మేము వివరించిన విషయాలపై బోర్డు ఛైర్మన్​ సానుకులంగా స్పందించారు. ప్రాజెక్టు ఒక్కసారి ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై కూడా చర్చించాం. బోర్డుకు ఉన్న అధికారాలతో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్పారు.

-రజత్​ కుమార్​, తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్​లో ఇప్పటికే పోరాడుతున్నామని ఈఎన్​సీ మురళీధర్ వెల్లడించారు. మిగులు జలాలకు సంబంధించి పూర్తి లెక్కలు తేల్చాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.