తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా తాంసి-కే పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనానికి ముందు ఉపాధ్యాయులు మాత్రలు పంపిణీ చేయగా ఈ ఘటన జరిగింది.
19 మంది విద్యార్థులకు అస్వస్థత
అనంతరం బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొత్తం 19 మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో కొందరు అడవి ఆముదం గింజలు తిన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది
విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎంఈవో కౌసల్య, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, సర్పంచ్ కరీం ఆస్పత్రికి చేరుకొని దగ్గరుండి చికిత్స చేయించారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం రాఠోడ్ నేతృత్వంలో పిల్లల వైద్య నిపుణులు అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్యం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: