ETV Bharat / city

IRDAI about omicron Treatment: ఒమిక్రాన్‌ చికిత్సకూ ఆరోగ్య బీమా: ఐఆర్‌డీఏఐ - తెలంగాణ వార్తలు

IRDAI about omicron Treatment : ఆరోగ్య బీమా పాలసీలు ఒమిక్రాన్‌ వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని ఐఆర్​డీఏఐ తెలిపింది. అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్‌-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలిచ్చింది. ఒమిక్రాన్‌ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి తన ఆదేశాలను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్‌ చికిత్సకూ బీమా పరిహారం చెల్లించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.

IRDAI about omicron Treatment
ఒమిక్రాన్‌ చికిత్సకూ ఆరోగ్య బీమా: ఐఆర్‌డీఏఐ
author img

By

Published : Jan 4, 2022, 9:56 AM IST

IRDAI about omicron Treatment : కొవిడ్‌ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్య బీమా పాలసీలు ఒమిక్రాన్‌ వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్‌-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ ఏప్రిల్‌ 1, 2020న ఆదేశాలిచ్చింది. ఒమిక్రాన్‌ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి తన ఆదేశాలను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్‌ చికిత్సకూ బీమా పరిహారం చెల్లించాల్సిందేనని సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

నగదు రహిత చికిత్సలకు సంబంధించి నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. బీమా సంస్థలతో ఉన్న ఒప్పందాల మేరకు పాలసీదారులకు నగదురహిత చికిత్స అందించడంలో ఆసుపత్రులు సైతం తగిన సహకారం అందించాలని కోరింది.

ఇదీ చదవండి: CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.