తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద పుష్కరాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం సీఎంకు ఆహ్వాన పత్రికను, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి పుష్కర ఘాట్లు, రహదారులను తీర్చిదిద్దినట్టు సీఎం వారికి వివరించారు.
ఇదీ చదవండి: