కృష్ణా జిల్లాలో కొవిడ్ 19 అత్యసవర సేవల విధులకు స్పెషలిస్ట్, జనరల్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఫల్మనాలజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్పులు నియామకానికి విజయవాడ గవర్నర్ పేటలోని ఐవి ప్యాలెస్‌లో ఉదయం పది గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు చేపట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి