కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది ఇంటర్‌మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం శాతం సిలబస్ (2020-21) 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించారు. ఈ ఏడాదీ 70 శాతం సిలబస్ కొనసాగించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సెప్టెంబరులో లేఖ రాసింది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై రెండు నెలలు దాటినా సిలబస్‌పై తెలంగాణ ఇంటర్‌బోర్డు ఇప్పటివరకు స్పష్టత (ts inter Board that does not give clarity on syllabus) ఇవ్వలేదు . అయితే ఇంటర్‌బోర్డు సిలబస్‌ను 30 శాతం తగ్గించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయం తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని అప్పట్లో ఇంటర్‌బోర్డు (ts inter board) ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలిసింది.
సీబీఎస్‌ఈ తగ్గించలేదనేనా?
కేంద్ర విద్యాశాఖ సూచించినా సీబీఎస్ (CBSE) ఈ మాత్రం ఇప్పటివరకు సిలబస్‌ను తగ్గించలేదు. ఈసారి సిలబస్‌ను రెండు భాగాలుగా విభజించి.. రెండు టర్మ్‌లుగా పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి టర్మ్ పరీక్షలు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల(మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్) రూపంలో జరపనుంది. ఈ పరీక్షలు డిసెంబరు 1 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. రెండు టర్మ్‌లుగా పరీక్షలు జరుపుతుండటం, కొంత ఛాయిస్ ఇస్తుండటంతో సిలబస్ తగ్గించలేదు.
రాష్ట్రంలో పరిస్థితి భిన్నం
తెలంగాణ రాష్ట్రం (telangana) లో ఇంటర్ విద్యార్థులు (inter students) దాదాపు 9.50 లక్షల మంది ఉన్నారు. ఇంటర్‌బోర్డు ఎప్పటిమాదిరిగానే వార్షిక పరీక్షలే జరుపుతోంది. ఈ విద్యా సంవత్సరం జూన్ 25న ఆన్‌లైన్ పాఠాలు, సెప్టెంబరు 1న ప్రత్యక్ష తరగతులు ప్రారంభించింది. ప్రథమ సంవత్సరం పరీక్షలతో 20-30 రోజులు వృథా అయ్యాయి. ఈ క్రమంలో సిలబస్‌ను పూర్తి చేయడం.. ముఖ్యంగా సర్కారు జూనియర్ కళాశాలల్లో కష్టమేనని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రస్తుతం జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకాగా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులే ఎక్కువ మంది హాజరవుతున్నారు. దాంతో మరో 15 రోజులపాటు తరగతులకు ఆటంకం కలుగుతోంది. సిలబస్‌పై బోర్డు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: