2018 గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. 2018 గ్రూప్-1 పరీక్ష కీలో ఇచ్చిన సమాధానాల్లో రెండు తప్పులున్నాయని..వాటిని మార్చాలని పిటిషనర్ న్యాయవాది తాండవ యోగేష్ వాదించారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తదుపరి నిర్వహించే పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.
కొత్తగా రెండు మార్కులు కలిపే అభ్యర్థులకు ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులతో పోటీ పడేందుకు సమాన అవకాశం ఇవ్వాలని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఇదీ చదవండి: తెలంగాణకు స్పీడ్ బోట్లు పంపాలి: సీఎం జగన్ ఆదేశం