ETV Bharat / city

త్వరలోనే రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ: మంత్రి కన్నబాబు

రైతుల పంటలకు అధిక ధరలు వచ్చేందుకు వీలుగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు చేస్తామని ఆయన తెలిపారు. అమరావతిలో వ్యవసాయ మిషన్​పై సీఎం సమీక్ష నిర్వహించారు.

రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు: మంత్రి కన్నబాబు
author img

By

Published : Sep 14, 2019, 4:40 PM IST

రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు: మంత్రి కన్నబాబు

రైతు ఉత్పత్తుల విక్రయానికి అధిక ధరలు వచ్చేందుకు వీలుగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తక్కువ వర్షపాతం కురిసే చోట చిరు ధాన్యాల పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన వెల్లడించారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఇన్​పుట్ సబ్సిడీ బకాయి పడిందని... ఆ బకాయిలను ఈ నెలలో చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు....
రైతులు పండించే ఉత్పత్తి విక్రయాలకు ప్రభుత్వం రవాణా భరించి మార్కెట్లకు తరలించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగుళూరు వంటి ఇతర మార్కెట్​లకు ఉత్పత్తులను తరలిస్తామన్నారు. మినుములు, పెసలు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి...అక్టోబరు 15 నాటికి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మార్కెటింగ్ సౌకర్యాలే ప్రధాన లక్ష్యం....
మార్కెట్​లో ధరలు లేకపోవడం సంక్షోభమని... ఉత్పత్తి కంటే మార్కెటింగ్ చాలా ఇబ్బందిగా ఉందని వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి తెలిపారు. రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయాలని, దాని కోసం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు నాగిరెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి-ధరల స్థిరీకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం: సీఎం

రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని కక్ష సాధింపు రాజకీయాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. యాంకర్ వాయిస్ := కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం చక్రాయపేట గ్రామము ఇసుక చింతలపల్లె గ్రామంలో లో కర్నాటి అమర్నాథరెడ్డి ఇంటిని అక్రమంగా కట్టడం పేరుతో అధికారులు కూల్చివేశారు. కూల్చిన ఇంటిని తులసి రెడ్డి ఈరోజు పరిశీలించి ఇంటి యజమాని తో కూల్చివేతపై చర్చించారు. ఇల్లు చెరువు స్థలంలో ఉందని అందువలన కూల్తున్నామని నీటిపారుదల రెవెన్యూ అధికారులు చెప్తున్నారు దీనిపై పై కాంగ్రెస్ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి మాట్లాడుతూ ఇల్లు కూల్చడం వైసిపి పార్టీ నీ వారి కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు. కక్ష సాధింపు తప్ప ఇల్లు కూల్చివేతకు వేరే కారణమే లేదన్నారు. గతంలో నీటిపారుదల శాఖ వారే చెరువుకు రక్షణ గోడ నిర్మించారని రక్షణ గోడకు 50 అడుగులు దూరంలో తన సొంత పొలంలో కట్టుకున్న ఇల్లు కట్టుకుంటే నష్ట మేమి రాదన్నారు. చెరువులో కనీసం చుక్క నీరు కూడా లేదన్నారు నీటి ప్రవాహానికి ఇల్లు ఏమాత్రం అడ్డంకి కాదన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా జెసిబి తో కూల్చడం దుర్మార్గమని అన్నారు. అధికారులు కూడా స్థానిక వైకాపా నాయకులకు వత్తాసు పలకడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లోని ఇలాంటి కక్షసాధింపు చర్యలు జరగడం గర్వ నియమం అన్నారు.. ప్రజాస్వామ్య వాదు లందరూ ఇలాంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాలి అన్నారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.