ETV Bharat / city

PRANADHARA TRSUT: వినూత్న పద్ధతిలో వరి సాగు.. ప్రాణధార ట్రస్ట్ సరికొత్త ప్రయోగాలు! - ap latest news

పెట్టుబడి తగ్గాలి.. రాబడి పెరగాలి..! కూలీ ఖర్చులు తగ్గాలి.. యాంత్రీకరణ పెరగాలి.! ఇదే వారి విధానం! ఇందు కోసం వినూత్న యాజమాన్య పద్ధతులు అవలంబిస్తోంది ప్రాణధార ట్రస్ట్‌! అధునాతన పనిముట్లను స్వయంగా తయారు చేస్తూ.. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులకు సంధానకర్తగా ఉంటూ.. సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. వరిసాగును లాభసాటిగా మార్చాలనే సంకల్ప బలమెంతో మనమూ చూద్దాం.

innovative-cultivation-practices-of-pranadhara-trust-in-rice
వినూత్న పద్ధతిలో వరి సాగు.. లాభాల కోసమేనంటున్న ప్రాణధార ట్రస్ట్
author img

By

Published : Oct 10, 2021, 2:11 PM IST

Updated : Oct 10, 2021, 2:23 PM IST

కృష్ణాడెల్టా రైతులకు ఖరీఫ్ సీజన్లో వరే సిరి. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా వరిలో దిగుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. యువత పట్టణాలకు వలస వెళ్తుండడంతో వ్యవసాయం చేసేవాళ్లూ తక్కువయ్యారు. ఈ సమస్యలనే సవాల్‌గా స్వీకరించింది ప్రాణధార ట్రస్ట్‌. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సమస్యకు.. పరిష్కారాలు వెతుకుతోంది. మినీ ట్రాక్టర్లను పొలంలోకి దించి, వాటికి అనుసంధానంగా విభిన్న పనిముట్లు తయారు చేసింది. వాటితో గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెంలో ప్రయోగాత్మకంగా 12 వందల ఎకరాలు సాగు చేస్తున్నారు.

నాట్లు వేయడం మొదలు కలుపు నివారణ, రసాయనాల పిచికారీ, ఎరువుల వాడకం ఇలా అన్నింటికీ యంత్రాలనే వినియోగిస్తోంది ప్రాణధార ట్రస్ట్‌. ఖర్చంతా భరిస్తూ.. గ్రామంలోనే వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ యూనిట్ పెట్టి.. రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఆచార్య NG రంగా వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మెళకువలు వరిసాగులో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని రైతులు అంటున్నారు.

వినూత్న పద్ధతిలో వరి సాగు.. లాభాల కోసమేనంటున్న ప్రాణధార ట్రస్ట్

ఒక కుటుంబం చిన్న ట్రాక్టరుతో 120 ఎకరాలు సులభంగా సాగుచేసే లక్ష్యంతో ప్రాణధార ట్రస్టు ప్రయోగాలు చేస్తోంది. కూలీల అవసరం తగ్గితే పెట్టుబడుల భారం తగ్గించుకోవచ్చనేది.. ట్రస్ట్ భావన. వరి సాగును లాభసాటిగా చేయడమే లక్ష్యమంటున్నారు ప్రాణధార ట్రస్టు సభ్యులు. రైతులు పండించిన పంటను దళారులకు విక్రయించకుండా.. గ్రామంలోనే ప్రాసెసింగ్, శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటిని ప్రాణధార సహకారంతో మార్కెటింగ్ చేసి వచ్చిన ప్రతిఫలాలను రైతులకు అందించనున్నారు.

ఇదీ చూడండి: IRON RIZING BULL: గొలుసుల లంకెలు.. సృజన రంకెలు

Last Updated : Oct 10, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.