ETV Bharat / city

'సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారు' - Lokesh comments on Jagan

అనంతపురం ఆస్పత్రి ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉందా అని పవన్‌ ప్రశ్నించారు.

అమాయక ప్రజలు బలవుతున్నారు
అమాయక ప్రజలు బలవుతున్నారు
author img

By

Published : May 1, 2021, 10:44 PM IST

అనంతపురం ఆస్పత్రి ఘటన దిగ్భ్రాంతికరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనా రోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులపై ఒక్కసారైనా సమీక్ష చేశారా..? అని ప్రశ్నించారు. సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారన్న చంద్రబాబు... మంత్రులు, ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో వైద్యం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను మాత్రం గాలికి వదిలేశారని ఆక్షేపించారు.

అసలు పాలన అనేది ఉందా..?

ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేవనే అనుమతిలేని ఆసుపత్రులకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. 104 పని చేయదు... అంబులెన్సులు రావని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్ధరణ పరీక్షలు చేయరని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉందా..? అని పవన్‌ ప్రశ్నించారు.

  • మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎంత ప్రమాదమో @ysjagan ని చూస్తే అర్ధమవుతుంది. ప్ర‌తిప‌క్షంపై కక్ష సాధించేందుకు పెడుతున్న శ్ర‌ద్ధ‌, అనారోగ్యంపాలైన ప్రజలకు ప్రాణ వాయువు అందించడంపై పెట్టకపోవడం దురదృష్టకరం.(1/3) pic.twitter.com/8SIIK7rVk2

    — Lokesh Nara (@naralokesh) May 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హత్య కేసు నమోదు చెయ్యాలి..'

ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు చెయ్యాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. "ఆక్సిజన్ అందక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది అమాయకులు చనిపోయారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎంత ప్రమాదమో జగన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ప్రతిప‌క్షంపై కక్ష సాధించేందుకు పెట్టే శ్రద్ధ ప్రాణ వాయువు అందించడంపై పెట్టకపోవడం దురదృష్టకరం. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. చనిపోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి." అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 19,412 కేసులు, 61 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.